Description
ఈ ప్రపంచం లో చాలా మంది చాలా రకాల సమస్యలతో సతమతం అవుతూ, జీవితాన్ని అతి భారంగా ముందుకు సాగించేవారు ఎంతో మంది ఉన్నారు. దీనికి కారణం వీరికి సరయిన గురువు లభించకపోవడమే అన్నది నా ప్రగాఢ విశ్వాసం. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలలో మొదటగా తల్లికి, తండ్రికి ఆ తరువాతి స్థానాన్ని గురువుకి ఇచ్చారంటే గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటో అర్ధమవుతుంది. అందుకే….. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అని అన్నారు పెద్దలు.. గురువు గురించి మాట్లాడేంత అనుభవం, అర్హత నాకు ఉన్నాయో లేవో తెలియదు.. కానీ నా ఈ జీవిత ప్రయాణంలో ఇప్పటివరకు నేను చూసిన, నేను ఎదుర్కున్న, నేను గెలిచిన చాలా సమస్యలు, జీవితంలోని నా అనుభవాలు, ఆ అనుభవాల పాఠాల నుండి నేను నేర్చుకున్న, నాకు తెలిసిన జ్ఞానం వీటన్నిటి ద్వారా నామనసులో ఒక బలమైన కోరిక పుట్టింది. అదేమిటంటే గురువు యొక్క గొప్పతనము, గురువు యొక్క అవసరము, అసలు గురువు మన జీవితాలలో ఎందుకు ఉండాలి అనే అంశాలపైన, నేను చూసిన జీవితంలో నాకు తెలిసిన అనుభవంతో గురువు యొక్క గొప్పతనం నలుగురికి తెలియాల్సిన అవసరం ఉందిన్న దృఢమైన భావంతో ఒక పుస్తక రూపంలో రాయాలని తలచాను. |